తెలంగాణ ముఖ్యమంత్రుల జాబితా
(తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రుల జాబితా నుండి దారిమార్పు చెందింది)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి | |
---|---|
విధం | గౌరవనీయులైన |
అధికారిక నివాసం | పూలే ప్రజా భవన్ గ్రీన్ ల్యాండ్స్ రోడ్డు, పంజాగుట్ట హైదరాబాద్ 500 082 తెలంగాణ, భారతదేశం |
నియామకం | తెలంగాణ రాష్ట్ర గవర్నరు |
భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రిని గవర్నరు నియమిస్తారు. రాజ్యాంగం ప్రకారం గవర్నరు రాష్ట్ర పరిపాలకుడు అయినప్పటికి అతనికి ఎటువంటి పరిపాలనాధికారాలు ఉండవు. శాసనసభ ఎన్నికలు ఫలితాలను బట్టి సరిపడా సంఖ్యాబలం ఉన్న పార్టీ లేదా కూటమిని గవర్నరు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు.అతను ముఖ్యమంత్రిని నియమిస్తారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రి మండలి రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. ముఖ్యమంత్రి పదవి కాలం ఐదు సంవత్సరాలు. ఈ పదవిని నిర్వహించడానికి ఎటువంటి సంఖ్యా పరిమితి లేదు. ఒక వ్యక్తి ఈ పదవిని ఎన్ని సార్లైనా చేపట్టవచ్చు.
2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో గెలుపొందిన కె.చంద్రశేఖరరావు 2014 జూన్ 2న రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ రాష్ట్రానికి ప్రారంభపు ముఖ్యమంత్రిగా పనిచేసాడు.[1]
తెలంగాణ ముఖ్యమంత్రులు జాబితా
[మార్చు]నం | పేరు | రాజకీయ పార్టీ | నియోజకవర్గం | పదవీకాలం | అసెంబ్లీ
(ఎన్నికలు) |
నియమించిన అప్పటి గవర్నరు | ||
---|---|---|---|---|---|---|---|---|
1 | కె.చంద్రశేఖరరావు | బీఆర్ఎస్ | గజ్వేల్ | 2014 జూన్ 2 | 2018 డిసెంబరు 12 | 9 సంవత్సరాలు, 187 రోజులు | 1వ
(2014) |
ఈ.ఎస్.ఎల్.నరసింహన్ |
2018 డిసెంబరు 13 | 2023 డిసెంబరు 6 | 2వ
(2018) | ||||||
2 | ఎ. రేవంత్ రెడ్డి | కాంగ్రెస్ | కొడంగల్ | 2023 డిసెంబరు 7 | అధికారంలో ఉంది | 1 రోజు | 3వ (2023) | తమిళిసై సౌందరరాజన్ |
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Shankar, Kunal (26 June 2015). "A mixed bag". Frontline. Archived from the original on 2 February 2020. Retrieved 2 February 2020.