కె.ఎ. మునిసురేష్ పిళ్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కె.ఎ.మునిసురేష్ పిళ్లె
జననం13 డిసెంబరు 1972
శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్
జీవిత భాగస్వామిఅన్నపూర్ణ
పిల్లలుఆదర్శిని భారతీకృష్ణ ఆదర్శిని శ్రీ
తల్లిదండ్రులుఆరంబాకం ఎల్లయ్య భారతమ్మ
వెబ్‌సైటుhttp://sureshpillai.com/

కె.ఎ. మునిసురేష్ పిళ్లె పాత్రికేయుడు, తెలుగు రచయిత. పూర్వ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పుట్టి పెరిగారు. ఆదర్శిని పత్రికా సంపాదకులు ఆరంబాకం ఎల్లయ్య, భారతమ్మ వీరి తల్లిదండ్రులు. వృత్తిరీత్యా హైదరాబాదులో స్థిరపడ్డారు. ఆదర్శిని మీడియా సంస్థను నిర్వహిస్తున్నారు. ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా, సినిమా రచయితగా కొనసాగుతున్నారు.

పాత్రికేయ ప్రస్థానం[మార్చు]

తన తండ్రి 1970లో స్థాపించిన ఆదర్శిని వారపత్రికలో పనిచేస్తూ వ్యాసాలు, కథలు, కవితలు రాస్తూ చిన్నతనంలోనే పాత్రికేయ ప్రస్థానం ప్రారంభించారు.

తిరుపతి గోవిందరాజస్వామి కళాశాలలో డిగ్రీ చదువుతుండగా ఉదయం దినపత్రికలో 1991లో ఎన్ఎంఆర్ సబ్ ఎడిటర్ గా ప్రధాన స్రవంతి పత్రికలలో ప్రస్థానం ప్రారంభించారు. 1993లో ఈనాడు దినపత్రికలో చేరారు. 1994 ఈనాడు జర్నలిజం స్కూలులో డిప్లమో చేసిన తర్వాత తిరుపతిలోనే కొనసాగుతూ వచ్చారు. ఈనాడు చిత్తూరు జిల్లా అనుబంధానికి ఇన్చార్జిగా పనిచేశారు. ఈనాడు ఇంటర్నెట్ ఎడిషన్, ఆదివారం అనుబంధం బాధ్యతలు చూశారు. 2006 తర్వాత ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా కొనసాగుతున్నారు. ఆదర్శిని మీడియా సంస్థను స్థాపించి.. మీడియారంగంలో బహుముఖ సేవలు అందిస్తున్నారు.

జర్నలిస్టుగా..[మార్చు]

అక్షర సాక్షి[మార్చు]

సాక్షి దినపత్రిక.. వయోజనులకు 30 రోజుల్లో తెలుగు భాష చదవడం నేర్పడానికి సంకల్పించిన బృహత్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి నిర్వహించారు. తెలుగు అక్షరమాలను నేర్పే పద్ధతిలోనే సరికొత్త క్రమం తీసుకువచ్చి.. ప్రత్యేకంగా రూపొందించిన ప్రణాళికతో ‘అక్షర సాక్షి’ కార్యక్రమాన్ని ఉమ్మడి తెలుగురాష్ట్రం అంతటా నిర్వహించారు. లక్షలాది మంది ఈ కార్యక్రమం ద్వారా.. తెలుగు చదవడం నేర్చుకున్నారు.

నా వార్తలు నా ఇష్టం[మార్చు]

ఎన్ టీవీ న్యూస్ చానెల్ లో ప్రసారం అయ్యే ‘నా వార్తలు నా ఇష్టం’ వ్యంగ్యాత్మక కార్యక్రమానికి 2007లో రూపకల్పన చేశారు.

హరిలోరంగహరీ[మార్చు]

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్ లో 2012లో ‘హరిలోరంగహరీ’ శీర్షికతో రాజకీయ వ్యంగ్యాత్మక కార్యక్రమాన్ని నిర్వహించారు.

వెలువరించిన పుస్తకాలు[మార్చు]

పూర్ణమూ నిరంతరమూ

కథలు 1 : పూర్ణమూ నిరంతరమూ[మార్చు]

ఈ సంపుటిలో మొత్తం 19 కథలు ఉన్నాయి. 2.0, అనాది-అనంతం, ఆ రోజు, ఆ 5 నిమిషాలు, ఇక్కడే ఉన్నాడేమిటీ, ఈగ, కొత్తచెల్లెలు, గడ్డి బొగ్గులు, గార్డు వినాయకం భజే, తోటకాడ బావి, తపసుమాను, నా నూకలు మిగిలే ఉన్నాయ్, పశువుల కొట్టం, పులినెక్కిన గొర్రె, పూర్ణమూ- నిరంతరమూ, పేరు తెలియని ఆమె, మా ఆయన అపరిచితుడు, రుచుల జాడ వేరు, వరాలత్త గాజులు కథలు ఇందులో ఉన్నాయి. ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మధురాంతకం నరేంద్ర ఈ కథాసంపుటికి ‘సాహిత్య పాత్రికేయం’ అనే శీర్షికతో ముందుమాట రాశారు. ‘న వినుతి.. నా వినతి..’ పేరుతో రచయితగా  తన నేపథ్యాన్ని సురేష్ పిళ్లె వివరించారు. అనాది- అనంతం, గార్డు వినాయకం భజే, రాతి తయారీ, పూర్ణమూ నిరంతరమూ నాలుగు కథల గురించి నెమలికన్ను మురళి రాసిన వ్యాసం కూడా ఇందులో ఉంది. ప్రఖ్యాత చిత్రకారుడు పినిశెట్టి నరసింహారావు ఈ కథా సంపుటికి ముఖచిత్రంతో పాటు, ప్రతికథకు బొమ్మలు గీశారు.

రాతి తయారీ

కథలు-2 : రాతి తయారీ[మార్చు]

ఈ సంపుటిలో మొత్తం 19 కథలు ఉన్నాయి. అలియాస్, కుక్కానక్కల పెళ్లి, చమించేయండి, జిందగీ, తడిచిన సోఫా, తోడు, థియరీ ఆఫ్ యాక్టివిటీ, దిద్దుబాట, దొరకానుక, నవ్వు మొలిచింది, నాన్నకు ప్రేమతో, బదిలీ, రాతి తయారీ, రిరంస, లచ్చిమి, వేరుపాత్రలు ఒకటే కథ, శివమ్, సెవెన్త్ ఫ్లోర్, సేవ బాధ్యత కథలు ఇందులో ఉన్నాయి. న్యూస్ చానెళ్ల పోటీ ప్రపంచంలో ఉండే పోకడల గురించి రాసిన రాతితయారీ కథపై చోరగుడి జాన్సన్ ‘న్యూస్ చానెల్ గొట్టాల మీద మట్టి కొట్టిన కథ’ అనే శీర్షికతో రాసిన వ్యాసం ఇందులో ఉంది. రాతి తయారీ కథ గురించి రచయిత సురేష్ పిళ్లె ఆకాశవాణి తిరుపతి రేడియో స్టేషన్ లో చేసిన ప్రసంగం కూడా ఇందులో ప్రచురించారు. ప్రఖ్యాత చిత్రకారుడు పినిశెట్టి నరసింహారావు ఈ కథా సంపుటికి ముఖచిత్రంతో పాటు, ప్రతికథకు బొమ్మలు గీశారు.

గారడీవాడు

కథలు-3 : గారడీవాడు[మార్చు]

ఈ సంపుటిలో మొత్తం 15 కథలు ఉన్నాయి. ఆంజమ్మ బస్సు ప్రయాణం, ఇఫ్తార్, కుడిపైట, గారడీవాడు, గేణమ్మ, టీనా, పడమటిల్లు, బర్రెర మునెమ్మ, లడ్డూ పెడతా గోవిందా, రిఫ్రెష్ ఫ్రం టియర్స్, వితండం మామ, సర్కిల్, స్కోర్ అయిటమ్, హైవే, @18 కథలు ఇందులో ఉన్నాయి. ‘టీనా’ కథ గురించి ప్రఖ్యాత రచయిత, జర్నలిస్టు ఆర్.ఎం. ఉమామహేశ్వరరావు రాసిన వ్యాసం ‘గుప్పెడు ప్రేమకు భరోసా టీనా’ కూడా ఇందులో ఉంది. ‘ఇఫ్తార్ కథ వెనుక కథ’ అంటూ రచయిత సురేష్ పిళ్లె రాసిన మరో వ్యాసాన్ని కూడా ప్రచురించారు. సుప్రసిద్ధ రచయిత, కవి, సినీనటుడు తనికెళ్ల భరణి ఈ కథాసంపుటికి ‘తిరుపతి లడ్డూలు!!’ అనే శీర్షికతో ముందు మాట రాశారు. ప్రఖ్యాత చిత్రకారుడు పినిశెట్టి నరసింహారావు ఈ కథా సంపుటికి ముఖచిత్రం గీశారు.

బహుమతులు- పురస్కారాలు[మార్చు]

బహుమతులు[మార్చు]

  • రాతితయారీ కథకు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) కథల పోటీలలో ప్రథమ బహుమతి -2005
  • తడిచిన సోఫా కథకు ప్రజాశక్తి వారి కథల పోటీలో బహుమతి -2006
  • తపసుమాను కథకు రామోజీ ఫౌండేషన్ కథావిజయం పోటీలలో ప్రథమబహుమతి -2019
  • వరాలత్త గాజులు కథకు తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా (తెల్సా) వారి కథల పోటీలో మూడో బహుమతి -2019
  • గారడీవాడు కథకు నార్త్ అమెరికా తెలుగు సంఘం (నాటా) వారి పోటీలలో ప్రథమ బహుమతి 2023
  • గేణమ్మ కథకు తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా (తెల్సా) వారి కథల పోటీలో ద్వితీయ బహుమతి -2022
  • లడ్డూపెడతా గోవిందా కథకు జాగృతి వారపత్రిక కథల పోటీలలో విశిష్ట బహుమతి -2023
  • సర్కిల్ కథకు టాల్ రేడియో వారి పోటీలలో బహుమతి -2023
  • షష్ఠముడు కవితకు తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా (తెల్సా) వారి కవితల పోటీలో ప్రథమ బహుమతి -2022
  • సుపుత్రికా ప్రాప్తిరస్తు నవలకు స్వాతి వారపత్రిక 16వారాల సీరియల్ పోటీలో బహుమతి -2000
  • పుత్రికా శత్రుః నవలకు స్వాతి వారపత్రిక 16 వారాల సీరియల్ పోటీలో బహుమతి -2002

పురస్కారాలు[మార్చు]

  • పుత్రికా శ్రతుః నవలకు చిత్తూరులోని ‘కుప్పం రెడ్డెమ్మ సాహితీ అవార్డు’ (నవలా విభాగం) -2023
  • గారడీవాడు కథా సంపుటికి కార్వేటినగరంలోని ‘శివేగారి దేవమ్మ అవార్డు -2023’