ద్వారబంధాల చంద్రయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


ద్వారబంధాల చంద్రయ్య తూర్పుగోదావరి జిల్లా తొలి స్వాతంత్ర్య సమరయోధుడు. తూర్పుగోదావరి జిల్లా మన్యంలోని బురదకోటను స్థావరంగా చేసుకొని బ్రిటీషువారిపై పోరాటం ఇతను బ్రిటీషువారికి వ్యతిరేకంగా 1879 లో తిరుగుబాటు లేవదీసినాడు.[1] [2] తిరుగుబాటునే నాటి బ్రిటిష్ అధికారులు రాంప పితూరీ అని పేరుపెట్టారు. ద్వారబంధాల చంద్రయ్య, పులిచింత సాంబయ్య అంబుల్ రెడ్డి న్యాయకత్వంలో సామ్రాజ్యవాదుల దోపిడీ-ప్రజల ప్రతిఘటనలో భాగంగా మన్యం రైతులు, మురాదార్లు అధికార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఈ తిరుగుబాయి లేవదీశారు. రంపచోడవరంలో ప్రారంభమయిన పితూరీ భద్రాచలం, రేకపల్లి, గోలుగొండ- ప్రాంతాలకు విస్తరించింది. ఇందులో భాగంగా ద్వారబంధాల చంద్రయ్య 1879 ఏప్రిల్ అడ్డతీగెల పోలీసు స్టేషనును ధ్వంసం చేశాడు, అదే సంవత్సరం చంద్రయ్య అనుచరులను 79 మందిని ప్రభుత్వం కాల్చివేసింది. 1880 ఫిబ్రవరిలో చంద్రయ్యను కూడా పోలీసులు కాల్చివేశారు.[3].

మూలాలు[మార్చు]

  1. "kapunews: తిరగబడ్డ తెలగబిడ్డ - మన్యం పులి - శ్రీ ద్వారబంధాల రామచంద్రయ్య నాయుడు గారు". kapunews. Archived from the original on 2021-11-08. Retrieved 2021-11-08. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. M.sharma (1987). Role Of Revolutionaries In The Freedom Struggle.
  3. https://ia801900.us.archive.org/33/items/in.ernet.dli.2015.491430/2015.491430.aandhrula-sanqs-ipta.pdf