పూసపాటి ఆనంద గజపతి రాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Poosapati Ananda Gajapati Raju
Member of Parliament
In office
1991–1996
అంతకు ముందు వారుKemburi Ramamohan Rao
తరువాత వారుKondapalli Pydithalli Naidu
నియోజకవర్గంBobbili
In office
1984–1989
అంతకు ముందు వారుP. V. G. Raju
తరువాత వారుKemburi Ramamohan Rao
నియోజకవర్గంBobbili
వ్యక్తిగత వివరాలు
జననం(1950-07-17)1950 జూలై 17
Vizianagaram, Vizianagaram estate (now in Andhra Pradesh, India)
మరణం2016 మార్చి 26(2016-03-26) (వయసు 65)
రాజకీయ పార్టీIndian National Congress
సంతానం3
నివాసంPhool Bagh Royal Palace, Fort Vizianagaram

పూసపాటి ఆనంద గజపతి రాజు విజయనగరం పూసపాటి రాజవంశీయుడు, మాజీ మంత్రి, మాన్సాస్ ట్రస్టు చైర్మన్.[1][2]

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన 1950 జూలై17న విజయనగరం మహారాజు పి.వి.జి.రాజు, కుసుమగజపతి ప్రథమ సంతానంగా జన్మించారు. అతని సోదరుడు అశోక్ గజపతి రాజు, సోదరి సునీతాదేవి. గ్వాలియర్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం, మద్రాస్ లయోలా కళాశాల, అమెరికా స్టెట్సన్ వర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీల్లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. హ్యూమనిస్టిక్ స్టడీస్ అంశంలో అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఇంటర్ అమెరికన్ యూనివర్సిటీ 2003లో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 2009లో ఆంధ్రా వర్సిటీ నుంచి పీహెచ్‌డీ డాక్టరేట్ అందుకున్నారు. [3]

రాజకీయ జీవితం[మార్చు]

ఆనంద గజపతి రాజు 1980లో జనతా పార్టీ (సెక్యులర్) తరుపున అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎస్.ఆర్.ఎ.ఎస్. అప్పలనాయుడు కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. అతను 1983లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ రంగప్రవేశం చేసారు. 1983 శాసనసభ సభ్యునిగా భీమునిపట్నం శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికైనారు.[4] అతను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మంత్రిగా, రెండుసార్లు పార్లమెంటు సభ్యునిగా పనిచేశారు. అతని సోదరుడు కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు. నందమూరి తారక రామారావు మంత్రివర్గంలో విద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. 1984లో టీడీపీ తరఫున బొబ్బిలి ఎంపీగా విజయం సాధించారు.[5] తర్వాత ఎన్టీఆర్‌తో విభేదించి కాంగ్రెస్‌లో చేరారు.1989 ఎన్నికల్లో బొబ్బిలి లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయారు.[6] 1991 ఎన్నికల్లో గెలుపొందారు.[7] 1996, 1998 ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభకు పోటీ చేసి ఓడారు.[8][9] విలువలు తగ్గిన రాజకీయాల్లో ఉండలేనంటూ 1998 నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు

రచయితగా[మార్చు]

అతను ‘రాజకీయ అర్థశాస్త్రంలో దారితప్పిన ఆలోచనలు’ అనే పుస్తకాన్ని 2014లో రాశారు.

అనువంశిక ధర్మకర్తగా[మార్చు]

అతని తండ్రి పి.వి.జి.రాజు మరణం (1995) తర్వాత విజయనగరం విద్యా సంస్థైన మాన్సాస్ ట్రస్టుకు చైర్మన్‌గా ఆనందగజపతి పనిచేసాడు. సింహాచలం, రామతీర్థం, అరసవిల్లి, శ్రీకూర్మం, విజయనగరం పైడితల్లమ్మ తదితర 108 దేవాలయాలకు అనువంశిక ధర్మకర్తగా వ్యవహరించారు.[2]

వ్యక్తిగత జీవితం[మార్చు]

1972లో ఆనందగజపతిరాజుకు ఉమతో వివాహం జరిగింది. వీరికిద్దరు కుమార్తెలు. ఆ తర్వాత వారిద్దరూ విడిపోయారు. 1999లో సుధను ద్వితీయ వివాహం చేసుకున్నారు. వీరికొక కుమార్తె. కొన్నేళ్లుగా విశాఖలో నివాసముంటున్నారు.

మరణం[మార్చు]

గజపతి రాజు ఛాతీలో తీవ్ర నొప్పి రావడంతో చికిత్స పొందుతూ 2016 మార్చి 26 ఉదయం 8.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు.[10]

మూలాలు[మార్చు]

  1. Pusapati Ananda Gajapathi Raju no more TNN | Mar 27, 2016, 09.40 AM IST
  2. 2.0 2.1 "Anand Gajapathi Raju passes away". G. NARASIMHA RAO. the hindu. 26 March 2016. Retrieved 26 March 2016.
  3. మాజీ మంత్రి ఆనందగజపతి కన్నుమూత
  4. "Andhra Pradesh Assembly Election Results in 1983". Archived from the original on 2016-03-03. Retrieved 2016-03-29.
  5. "List of winner and runner MPs in 1984 General Elections". Archived from the original on 2014-06-14. Retrieved 2016-03-29.
  6. "List of winner and runner MPs in 1989 General Elections". Archived from the original on 2016-03-19. Retrieved 2016-03-29.
  7. "List of winner and runner MPs in 1991 General Elections". Archived from the original on 2017-04-29. Retrieved 2016-03-29.
  8. General (11th Lok Sabha) Election Results India
  9. "General (12th Lok Sabha) Election Results India". Archived from the original on 2016-03-15. Retrieved 2016-03-29.
  10. Pusapati Anand Gajapati Raju passes away DECCAN CHRONICLE. Published Mar 27, 2016

ఇతర లింకులు[మార్చు]