బంకోలా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బంకోలా తెలుగు చారిత్రక నవల.ఇది శాస్త్రీయ చారిత్రిక నవలా రచన విధానాన్ని చక్కగా అనుసరిస్తూ రాయబడిన నవల.

ఈ నవలారచయిత శ్రీ సాధు సుబ్రహ్మణ్యశర్మ కాకినాడ వాసులు,[1] కాకినాడలో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. కాకినాడ సమీపంలో సాగరతీరంలో కోరంగి అనే విస్మృత ఓడరేవు ఉంది. బందరు రేవునుంచి ఈస్టిండియా కంపెనీ, కోరంగి ప్రాంతంనుంచి డచ్ ఈస్టిటండియా కంపెనీ వ్యాపారం నిర్వహించాయి. స్థానిక మత్స్యకారులు కోరంగి నుంచి సముద్రం మీదకు చేపలవేటకు వెళ్ళేవారు. క్రమంగా వారినౌకలు శక్తి వంతమైనవి అయ్యాయి. 18వ శతాబ్దిలో కోరంగిలో నౌకల నిర్మాణం, కట్టడం, బాగుచెయ్యడంలో స్థానికులు గొప్ప నైపుణ్యం సంపాదించారు. డచ్ వారు కోరంగి రేవును చిన్న టౌనుగా అభివృద్ధి చేశారు. ఆ నాటి చారిత్రిక ఘటనలను సందర్భోచితముగా నవలా రచనలో వాడుకొని, కోరంగిలో ఒక వారకాంత-సుందరస్రీని, మత్స్యకారుల యువకుణ్ణి ముఖ్యపాత్రలుగా చిత్రిస్తూ 1750-1850వరకు ఆరేవు చుట్టూ కథ అల్లబడింది. ఆనాటి తెలుగువారి జీవితం, సమాజం, పాత్రల మానసిక విశ్లేషణ, డచ్ ఇంగ్లీషు వాణిజ్య కంపెనీలమధ్య పోటీ, సంబంధాలు, చరిత్ర, కల్పన కలగలిపి చదువరుుల ఆసక్తిని పట్టి నిలుపుతూ, గొప్పగా చిత్రించారు రచయిత. మధ్యలో విముక్తి పోరాట ప్రయత్నాలు వగైరా కథను కూడా చెప్తారు. అతిశయోక్తులు, నేలమీద నిలవని అభూతకల్పనలు కాక, ఆంధ్రదేశ చరిత్రలో ఏభైఏళ్ళను ఈ గ్రంథ పుటల్లో నిక్షిప్తం చేశారు సాధు సుబ్రహ్మణ్యశర్మగారు.[2] ఆధునికదృష్టి, చారిత్రక నవలా రచనాశిల్పం వారి రచనకు వన్నెతెచ్చాయి. బ్రిటిష్ కాలం నాటి సామాజిక చరిత్రను కళ్ళకు కట్టించే నవల ఇది. బంకోలా అంటే సాగరతీరంలో దీపస్థంభం(లైట్ హౌస్). ఇప్పటికీ కోరంగి వద్ద శిథిలమైన ఆనాటి దీపస్థంభం కానవస్తుంది. సాధు సుబ్రహ్మణ్య శర్మ ఫోటో: ది హిందూ పత్రిక సౌజన్యంతో.

మూలాలు

[మార్చు]
  1. "K.N. Murali Sankar KAKINADA". The Hindu (in Indian English). 2018-02-21. ISSN 0971-751X. Retrieved 2023-11-14.
  2. "మిసిమి పత్రిక వ్యాసం" (PDF). July 2012.

బయటి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=బంకోలా&oldid=4229609" నుండి వెలికితీశారు