జన ఆందోళన్ పార్టీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జన ఆందోళన్ పార్టీ (ఆల్ ఇండియా జన ఆందోళన్ పార్టీ) కాలింపాంగ్ జిల్లా - డార్జిలింగ్ జిల్లాలో ఉన్న రాజకీయ పార్టీ. ఇది 2016లో స్థాపించబడింది. పార్టీ అధ్యక్షుడు డాక్టర్ హర్కా బహదూర్ ఛెత్రి, కాలింపాంగ్ మాజీ ఎమ్మెల్యే.[1]

ఎన్నికల్లో పోటీ[మార్చు]

ఈ పార్టీ 2016లో కలింపాంగ్ నుండి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. దాని అభ్యర్థి హర్కా బహదూర్ ఛెత్రి గూర్ఖా జనముక్తి మోర్చా అభ్యర్థి సరితా రాయ్ చేతిలో తృటిలో ఓడిపోయాడు.[2] 2017 కాలింపాంగ్ మునిసిపాలిటీ ఎన్నికలలో, ఈ పార్టీ రెండు స్థానాలను గెలుచుకుంది.[3] 2019లో, హర్కా బహదూర్ ఛెత్రీ డార్జిలింగ్ నియోజకవర్గం నుండి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి విఫలమయ్యారు. ఈ పార్టీ నుండి అమర్ లామా 2019 లో డార్జిలింగ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీ చేసి ఓడిపోయాడు.

మూలాలు[మార్చు]

  1. "New party launched in Darjeeling". The Hindu. 27 January 2016. Retrieved 29 March 2019.
  2. "Darjeeling eludes Mamata's TMC, GJM retains hold over hilly district". The Indian Express. 20 May 2016. Retrieved 29 March 2019.
  3. "In retrospect: TMC's Hill debut in Mirik a commendable job". Millennium post. 19 May 2017. Retrieved 29 March 2019.